
వైఫల్యాలను ఎండగడితే కేసులా..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే సాక్షి దినపత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు నమోదు చేయడం సరికాదు. విచారణ, నోటీసుల పేరా సాక్షి పత్రికను ఇబ్బందులు పెట్టడం ఏపీ ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారం ఉందని కక్షసాధింపులకు పాల్పడితే ప్రజలే గుణపాఠం చెబుతారు.
– బి.అజయ్‌సారథిరెడ్డి, సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్
అక్రమ కేసులు ఎత్తివేయాలి..
సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. అక్రమాలు, అన్యాయాలను పత్రిక వెలికితీస్తూ ప్రజల పక్షాన నిలబడుతుంది. వాస్తవాలను రాస్తే అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదు. పత్రికా స్వేచ్ఛపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
– గుగులోత్ కిషన్‌నాయక్, గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

వైఫల్యాలను ఎండగడితే కేసులా..