‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు సరికాదు

Oct 18 2025 7:13 AM | Updated on Oct 18 2025 7:13 AM

‘సాక్

‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు సరికాదు

నెహ్రూసెంటర్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రికపై కక్షసాధింపు చర్యలు, ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని రాజకీయ, ప్రజా సంఘాలు, కుల, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం చేపట్టిన నిసరన కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా, కుల, జర్నలిస్టు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ ని ర్వహించి అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన ధ ర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిజాలు నిర్భయంగా రాస్తున్న సాక్షి దినపత్రికపై అక్రమ కేసులు, వేధింపులు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. సాక్షి పత్రిక, ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులను ఖండిస్తున్నామని, తక్షణమే కేసులు ఎత్తివేయాలని డిమా ండ్‌ చేశారు. అధికారంలోకి రాకముందు ఒకలా, వ చ్చాక మరోలా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారని, తీరు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, బీఆర్‌ఎస్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, బీ ఎస్పీ, ఎమ్మార్పీఎస్‌, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎల్‌హెచ్‌పీఎస్‌, జర్నలిస్టు సంఘాలు, అంబేడ్కర్‌ యువజన సంఘం, గిరిజన సంఘాల నాయకులు బి.అజయ్‌ సారథిరెడ్డి, పెరుగు కుమార్‌, చింతకుంట్ల వెంకన్న, సమ్మెట రాజమౌళి, మందుల మహేందర్‌, ఎండి.ఫరీద్‌, మండల వెంకన్న, హెచ్‌.లింగ్యా, సామ పాపయ్య, గుజ్జు దేవేందర్‌, దార్ల శివరాజ్‌, గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, గుగులోత్‌ కిషన్‌నాయక్‌, డాక్టర్‌ వివేక్‌, గుగులోత్‌ సూర్యప్రకాశ్‌, శివ వర్మ, బోడ రమేశ్‌, గుగులోత్‌ భీమానాయక్‌, మంగీలాల్‌నాయక్‌, పట్ల మధు, చిత్తనూరి శ్రీనివాస్‌, మద్దినేని గుట్టయ్య, తప్పెట్ల వీరన్న, కుర్ర మహేశ్‌, బోడ లక్ష్మణ్‌, రేషపల్లి నవీన్‌, అడ్వకేట్స్‌ దర్శనం రామకృష్ణ, భూక్య మోహన్‌నాయక్‌, బనిశెట్టి వెంకటేష్‌, సోమారాపు వీరస్వామి, ఆవులదొడ్డి వెంకట్‌యాదవ్‌, రాసగొల్ల సత్యం, సాక్షి జర్నలిస్టులు ఈరగాని బిక్షం, అర్రం రమేశ్‌, బోనగిరి శ్రీనివాస్‌, ఇరుకుళ్ల కిరణ్‌కుమార్‌, చింతకుంట్ల యాకాంబ్రం, జిల్లెల మురళీమోహన్‌, గుంటి సురేశ్‌, పసునూటి వేణు, కై లా ప్రకాశ్‌, దూదికట్ల రామాచారి, విజయ్‌, సతీష్‌, పానుగంటి శ్రీనివాస్‌, కురవి ప్రభాకరాచారి పాల్గొన్నారు.

మానుకోటలో ర్యాలీ, నిరసన.. గళమెత్తిన ప్రజానీకం

పార్టీలు, ప్రజా, కుల, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల మద్దతు

‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు సరికాదు1
1/1

‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు సరికాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement