
మార్కెట్ నిండా మక్కలు
● 11వేల బస్తాల రాక
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు మక్కలు పోటెత్తాయి. ఇటీవల మక్కల సీజన్ ప్రారంభం కాగా, శుక్రవారం అత్యధికంగా 11,016 బస్తాల మక్కలు అమ్మకానికి వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ట్రాక్టర్లలో తీసుకువచ్చిన మక్కలను షెడ్లలో పోసుకున్నారు. దీంతో షెడ్లు నిండిపోగా, మిగిలిన వారంత ఓపెన్‌యార్డుల్లో మక్కలను రాశులుగా పోసుకున్నారు. అధిక సంఖ్యలో మక్కలు రావడంతో వ్యాపారులు టెండర్లను ఆలస్యంగా వేశారు. మరోవైపు ఇ–నామ్ సర్వర్ మొరాయించడంతో గంటన్నర ఆలస్యంగా విన్నర్ జాబితా విడుదల అయింది. అనంతరం రాత్రి వరకు కాంటాలు, తొలకాలు జరి గాయి. దీంతో రైతులు రాత్రి వరకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా మక్కలు క్వింటాకు గరిష్ట ధర రూ. 2,098 పలుకగా, కనిష్ట ధర రూ.1,850 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
మార్కెట్లకు సెలవులు..
మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లకు ఈనెల 18, 19వ తేదీల్లో వారాంతపు సెలవులు కాగా, 20న నరకచతుర్దశి, 21న దీపావళి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. తిరిగి 22న మార్కెట్‌లు పునఃప్రారంభం అవుతాయని తెలిపారు.
రైతులు పంటలు నమోదు చేసుకోవాలి
కురవి: రైతులు సాగు చేసిన పంటలను నమోదు చేసుకోవాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. శుక్రవారం మండలంలోని మొగిలిచర్ల గ్రామంలోని పత్తి పంటను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పత్తిపంటపై కొత్తగా వచ్చిన కపాస్ కిసాన్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణాధికారులు పత్తి పంట వేసిన ప్రతీ రైతు పంటను నమోదు చేయాలని సూచించారు. పత్తి రైతులు సీసీఐకి అమ్మకం చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఏఓ గుంటక నరసింహారావు, ఏఈఓ రాజేశ్వరి, రైతులు చల్లగుండ్ల ప్రవీణ్, నీలం రమేశ్, చల్లగుండ్ల మాధవరావు, వీరభద్రాచారి, నామా రామారావు, ఏపూరి వీరన్న పాల్గొన్నారు.

మార్కెట్ నిండా మక్కలు