
సబ్‌స్టేషన్ తనిఖీ
నర్సింహులపేట: మండలంలోని ముంగిమడుగు విద్యుత్ 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్‌లో డేటా అక్విజేషన్ అండ్ కంట్రోల్, మానిటరింగ్ సిస్టమ్ పనులను పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లో జరుగుతున్న పనులు నవంబర్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది ఎల్‌సీ తీసుకొని పనులు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పనులు చేయాలన్నారు. విద్యుత్ సిబ్బంది సక్రమంగా పని చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్‌స్టేషన్, మండలంలోని సిబ్బంది ఇబ్బందులను సీఎండీకి వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ విజయేందర్‌రెడ్డి, డీఈలు రవి, సునీత, ఏఈ పాండు తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలి
మహబూబాబాద్ రూరల్: దీపావళి పండుగను పురస్కరించుకొని స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకుల పేరుతో సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈ–మెయిల్, వెబ్‌సైట్ ద్వారా ప్రజలను మోసంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం తెలిపారు. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్ నంబర్ తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1నుంచి ఇప్పటివరకు 390 మంది మోసపోయి రూ.8.5 లక్షల వరకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షిస్తారన్నారు. ధ్రువీకరించిన వెబ్‌సైట్లు, అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేయాలని, టెలిగ్రామ్ లేదా ఇతర లింకుల ద్వారా ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని, ఎవరితో బ్యాంక్ వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ నంబర్ పంచుకోవద్దని సూచించారు. ముందుగానే చెల్లింపులు చేయకుండా, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఎలాంటి మోసాలు జరిగినా.. వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.
ప్రజావైద్య వ్యవస్థను పటిష్టం చేయాలి
నెహ్రూసెంటర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజా వైద్య వ్యవస్థను పటిష్టం చేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం పీహెచ్‌సీ వైద్యులు, సీనియర్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వ వైద్య కార్యక్రమాల అమలు, వెంటవెంటనే ఆన్‌లైన్ చేయాలని సూచించా రు. పీహెచ్‌సీలకు వచ్చిన ఫైనాన్స్‌ను మూడు, ఆరు నెలలకు ఓ మారు ఆడిట్ చేపించుకోవా లని తెలిపారు. సమన్వయంతో ఉద్యోగులు పని చేసినప్పుడే ప్రజాక్షేత్రంలో ప్రజల ఆరో గ్యాలను కాపాడవచ్చని తెలిపారు. సమావేశంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగుతో
అధిక లాభాలు
కురవి: ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న అన్నారు. శుక్రవారం సీరోలు మండలం తాళ్లసంకీస గ్రామంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో రైతు ప్రతాపని పుల్ల య్య ఆయిల్ పామ్ తోటలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల శాస్త్రవేత్తలతో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడారు. కేవీకే శాస్త్రవేత్తలు బి.కాంతికుమార్, సుహాసిని, కోరమండల్ సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పి.భాస్కర్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్‌రెడ్డి, సీరోలు ఏఓ చాయారాజ్, ఏఈఓ రమేశ్, సీహెచ్.రాములు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్ తనిఖీ

సబ్‌స్టేషన్ తనిఖీ