
దాడులను ఖండిస్తున్నాం..
సాక్షి పత్రికకు నోటీసులు అందజేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏపీ పోలీసులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికకు స్వేచ్ఛ ఉంటుంది. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వ తీరు మంచిది కాదు.
– ఎండి. ఫరీద్, బీఆర్‌ఎస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్
కక్షసాఽధింపు చర్యలు మానుకోవాలి
సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభు త్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు ఉంది. ఇప్పటికై నా సాక్షి పత్రికపై చర్యలు మానుకుని ఏపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులు, అక్రమ కేసులకు పాల్పడితే ప్రజానీకం సహించదు. – మండల వెంకన్న,
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

దాడులను ఖండిస్తున్నాం..