
పది ప్రణాళిక ఏది?
● గత ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాకు మొదటి స్థానం
● ఇప్పటి వరకు ఊసేలేని కార్యాచరణ
● ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల పనితీరుకు పదో తరగతి ఫలితాలే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొనే జిల్లా అధికారులు.. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం కీలకంగా మారుతుంది. గత ఏడాది అధికారులు అమలు చేసిన ప్రత్యేక ప్రణాళిక మంచి ఫలితం ఇచ్చింది. పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే మానుకోట జిల్లాను ప్రఽథమ స్థానంలో నిలిపింది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. విద్యాశాఖలో అధికారుల మార్పు, పలు పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు రాకతోపాటు.. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో అధికార యంత్రాంగం నిమగ్నం కావడం.. వెరసి దీని ప్రభావం పదో తరగతి ఫలితాలపై పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది టాప్..
జిల్లా ఏర్పాటు తర్వాత మొదలైన కసరత్తు ఎట్టకేలకు గత ఏడాది మంచి ఫలితం ఇచ్చింది. పది ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా విద్యార్థులు టాప్‌లో నిలిచారు. 2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు 85.54శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచారు. దీంతో ఫలితాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా సబ్జెక్టు టీచర్లు మొదలుకొని హెచ్‌ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల వరకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత విద్యాసంవత్సరం కాస్త మెరుగు పడి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. అదే ఊపులో గత విద్యా సంవత్సరం 99.29 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్‌ఐటీలో జిల్లాకు చెందిన 175 మంది విద్యార్థులు సీటు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు.
కనిపించని ప్రత్యేక ప్రణాళిక
గత విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభం నుంచే పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక ప్రణాళికతో వెళ్లిన విద్యాశాఖ అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ ఊసెత్తడం లేదు. కాగా గత ఉడాది దసరా సెలవుల తర్వాత నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దాతల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం పెట్టారు. డిసె ంబర్‌లో సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యంగా బోధన వేగవంతం చేశారు. డిసెంబర్‌లో మొదటి సగ భాగం సిలబస్‌తో ప్రత్యేకంగా రూపొందించిన అంశాలపై పరీక్షలు పెట్టారు. జనవరి మొదటి వారంలో సిలబస్ పూర్తి చేసి మిగిలిన సగం సిలబస్‌తో మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఏఏఈ ఈఆర్‌టీ రూపొందించిన కరదీపికలతో పాటు, ప్రత్యేక పరీక్ష పత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించారు. కేజీబీబీ, మోడల్ స్కూల్స్‌తోపాటు, ప లు పాఠశాలల్లో వెనకబడిన విద్యార్థులకు వరంగ ల్, హనుమకొండ నుంచి సిలబస్‌లో ప్రావీణ్యం గలి గిన అధ్యాపకులను పిలిపించి ప్రత్యేక క్లాసులు చె ప్పించారు. దీంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
అడ్డంకులను అధిగమిస్తేనే..
గత వైభవం చెదిరిపోకుండా, ఈ ఏడాది కూడా జిల్లా విద్యార్థులు రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు సాధించాలి. అయితే ఈ ఏడాదిలో కొందరు హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ వచ్చింది. దీంతో కొన్ని పాఠశాలలకు కొత్తగా ఉపాధ్యాయులు వచ్చారు. గతంలో ప్రణాళికలు రూపొందించి అమలు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ పొందారు. కొత్తగా వచ్చిన డీఈఓ ముందు స్టాఫ్, తర్వాత ఉపాధ్యాయులను అర్థం చేసుకోవడానికే సమయం పట్టింది. ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల హడాహుడితో ఉపాధ్యాయులు ట్రైనింగ్ పేరుతో తరచూ పాఠశాలలకు గైర్హాజరు కావడం.. ఉన్నతాధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టడంతో అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పటి కైనా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తే ఉత్తమ ఫలి తాలు సాధించవ్చని విద్యావేత్తలు అంటున్నారు.
విద్యా పరీక్ష ఉత్తీర్ణులు శాతం రాష్ట్రంలో
సంవత్సరం రాసిన వారు స్థానం
2021–22 9,204 8,421 91.49 20
2022–23 8,461 7,227 85.54 22
2023–24 8,178 7,738 94.62 12
2024–25 8,184 8,126 99.29 01

పది ప్రణాళిక ఏది?