
బంద్ విజయవంతం
న్యూస్‌రీల్
– మరిన్ని ఫొటోలు 11లోu
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రోడ్డెక్కిన బడుగులు
మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు,
కుల సంఘాలు
ఉదయం నుంచి కదలని బస్సులు
మూసివేసిన వ్యాపార సంస్థలు
సాక్షి, మహబూబాబాద్/ నెట్‌వర్క్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం నిర్వహంచిన బంద్ విజయవంతమైంది. జిల్లాలో ఉదయం నుంచే బీసీ సంఘాల నాయకులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా జిల్లాలోని వామపక్ష పార్టీలతో పాటు, అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు మద్దతు ఇచ్చి బంద్‌లో పాలుపంచుకున్నారు. బంద్ ప్రభావంతో ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. మధ్యాహ్నం వరకు వర్తక, వ్యాపార సంస్థలు మూసివేశారు.
కదలని బస్సులు..
బంద్‌ను విజయవంతం చేసేందుకు జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు ఆర్టీసీ డిపోల వద్దకు కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల జేఏసీ నాయకులు ఉదయమే చేరుకున్నారు. డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని గమనించిన డిపో మేనేజర్లు మధ్యాహ్నం వరకు బస్సులు బయటకు తీయలేదు. దీంతో విషయం తె లియక ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
డోర్నకల్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార సంస్థలు, పాఠశాలలు, పె ట్రోల్‌బంకులు మూతబడ్డాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు.
మరిపెడలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు వేర్వేరుగా నిరసన వ్యక్తం చేశారు. మూడు దఫాలుగా రాస్తారోకో చేయడంతో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
బయ్యారంలో బంద్ విజయవంతమైంది. బయ్యారం, గంధంపల్లి–కొత్తపేట గ్రామాల్లోని వ్యాపార, విద్యాసంస్థలు బంద్ సందర్భంగా మూతపడ్డాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు బయ్యారంలో రాస్తారోకో నిర్వహించారు.
మానుకోట పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నెల్లికుదురు మండలంలో పార్టీలకు అతీతంగా నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.
గూడూరులో ఉదయం 6 గంటలకు బీసీ జేఏసీ నాయకులతో పాటు మండలంలోని అన్ని బీసీ కుల సంఘాల నాయకులు బంద్‌కు మద్దతుగా తరలివచ్చారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన అనంతరం ప్రధాన బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఎన్‌హెచ్‌పై వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
కురవి, సీరోలు మండలాల్లో బీసీ జేఏసీ బంద్‌కు ఎమ్మార్పీఎస్, తెలంగాణ ముదిరాజ్ సంఘం, తెలంగాణ గిరిజన సంఘం తదితర సంఘాలు మద్దతు పలికాయి. కురవి మండల కేంద్రంలో సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నేరడ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై, టీఆర్‌ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద రాస్తారోకో వేర్వేరుగా నిర్వహించారు.
తొర్రూరులో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. వీరితో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు వేర్వేరుగా బంద్‌లో పాల్గొన్నాయి. ఆర్టీసీ డిపోలో బస్సులు బయటకు రాకుండా బీసీ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహిస్తున్న క్రమంలో బస్టాండ్ సెంటర్‌లో ఎదురుపడడంతో రిజర్వేషన్ల విషయంలో కొంత వాగ్వాదం జరిగింది.
కొత్తగూడలో వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బంద్‌కు సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు తుడుందెబ్బ, ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపి బంద్‌లో పాల్గొన్నాయి.
గార్ల పట్టణంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, పాఠశాలలు బంద్ పాటించాయి. ఈ బంద్‌లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు.
పెద్దవంగర మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు వేర్వేరుగా బంద్‌లో పాల్గొని ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలను మూసి వేయించారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో చిన్నగూడూరు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని వ్యాపారస్తులు, దుకాణా దారులు స్వచ్ఛందంగా బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు ప్రభుత్వ పాఠశాలలో బంద్‌కు టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం మద్దుతు తెలిపింది. ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.
కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. పలు దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. కాగా వామపక్షపార్టీల ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
దంతాలపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగి సింది. జాతీయ రాహదారిపై అన్ని పార్టీల నా యకులు వేర్వేరుగా రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు షాపులను బంద్ చేయించారు.

బంద్ విజయవంతం

బంద్ విజయవంతం