
అడవి పందిని ఢీకొన్న బైక్ ..
● వాహనం అదుపు తప్పి వ్యక్తికి
తీవ్రగాయాలు
● చికిత్స పొందుతూ మృతి
కాళేశ్వరం: బైక్ ..అడవి పందిని ఢీకొంది. ఈ ప్ర మాదంలో వాహనం అ దుపు తప్పడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందా డు. ఈ ఘటన మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాటారం మండలం నస్తురుపల్లికి చెందిన పులాల మల్ల య్య(40) ఈనెల10న అంబటిపల్లికి వెళ్లాడు. తిరిగి రాత్రి తన బైక్‌పై స్వగ్రామం వస్తున్నా డు. మార్గమధ్యలో సూరారం సబ్ స్టేషన్ వద్ద అడవి పంది అడ్డొచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ఘ టనలో మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందా డు. మృతుడి భార్య పులాల ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
‘మిషన్’ సిమెంట్ దిమ్మెను ఢీకొని మరొకరు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: బైక్.. మిషన్ భగీరథ వా టర్ ట్యాంక్ సిమ్మెంట్ దిమ్మెను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం మండలంలో ని ఒడ్డుగూడెం సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని లింగాలకు చెందిన ఊకే సార య్య(30), ఆగబోయిన మల్లయ్య బైక్‌పై ఈనె ల 12న లింగాల నుంచి మేడారం వెళ్లారు. సో మవారం ఉదయం లింగాలకు బయలుదేరా రు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి ఒడ్డుగూడెం సమీపంలో రోడ్డు పక్కన మిషన్ భగీ రథ వాటర్ ట్యాంక్ సిమ్మెంట్ దిమ్మెను ఢీకొంది. దీంతో సారయ్య అక్కడికక్కడే మృతి చెందగా మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.