
కేయూ, హార్ట్‌ఫుల్‌నెస్ ఎంఓయూ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ మధ్య సంవత్సర కాలానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదురింది. ఈ మేరకు సోమవారం కేయూలోని అకడమిక్ కమిటీహాల్‌లో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ ఆదిత్య, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతోకూడిన విద్యతోపాటు వారిలో జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. ధ్యానం, యోగా, పొలారిటీ టెక్నిక్స్, డి ఆడిక్షణ్ శిక్షణ, శాస్త్రసాంకేతికత, కమ్యూనిటీ వెల్ఫేర్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, సైన్స్ డీన్ ప్రొఫెసర్ జి. హనుమంతు, డీన్ స్టూడెంట్స్ ఆఫైర్స్ మామిడాల ఇస్తారి, కేయూ అభివృద్ధి అధికారి ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, మహిళా ఇంజనీరింగ్ కళా శాల ప్రిన్సిపాల్ కె. భిక్షాలు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ, నాస్కమ్ కంపెనీ ఎంఓయూ..
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ (నాస్కమ్) సంస్థతో కాకతీయ యూనివర్సిటీ సంవత్సర కాలానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనభవనంలో నాస్కమ్ ప్రతినిధులు సతీశ్‌కుమార్, బొజ్జమ్ ప్రవీణ్‌కుమార్, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం ఒప్పందాలపై సంతకాలు చేసి పరస్పరం మార్పుకున్నారు. ఈ సందర్భంగా కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడం, నూతన సాంకేతికతపై శిక్షణ ఇస్తామన్నారు. కేయూ మహిళాఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భిక్షాలు, ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, డాక్టర్ సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.
ధ్యానం, యోగా, నాయకత్వ
లక్షణాలకు ప్రాధాన్యం

కేయూ, హార్ట్‌ఫుల్‌నెస్ ఎంఓయూ