
బడికి వెళ్లాలంటే.. బురద దాటాలి
● పాఠశాలలో
కనీస మౌలిక వసతులు కరువు
● విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు
మరిపెడ రూరల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుంది. విద్యతోనే ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశం ఉంది. అలాంటి విద్యాబుద్ధులు నేర్చుకునే పాఠశాలకు కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బురద రోడ్లపై నుంచి వెళ్లాల్సి దుస్థితి నెలకొంది. మరిపెడ మండలంలోని వీరారం గ్రామ రెవెన్యూ పరిధి అజ్మీరాతండా గ్రామ పంచాయతీ శివారు జీన్యతండా ప్రాథమిక పాఠశాలలో 17 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా తండా శివారులో ఉన్న పాఠశాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు బురద రోడ్లు, చెట్ల పొదల నుంచి అవస్థలు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుస్తుండడంతో పిల్లలు జారీ బురదలో పడిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధుల ద్వారా పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే మరుగుదొడ్లను సగం వరకు నిర్మించి మధ్యలో నిలిపివేశారు. కాగా, అధికారులు స్పందించి పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, రోడ్డు బాగుచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, జీన్యతండా గిరిజన ప్రజలు కోరుతున్నారు.

బడికి వెళ్లాలంటే.. బురద దాటాలి

బడికి వెళ్లాలంటే.. బురద దాటాలి