మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి | - | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

Oct 12 2025 6:55 AM | Updated on Oct 12 2025 6:55 AM

మృత్య

మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

60 రోజులుగా చికిత్స పొందుతున్న నిహాన్సిక మృతి

చిల్పూరు: ఓ చిన్నారి 60 రోజు లుగా మృత్యువుతో పోరాడి ఓ డింది. రెండు నెలల క్రితం వేడినీళ్ల బకెట్‌లో పడగా శరీరం మొ త్తం కాలింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అ లుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పల్లగుట్ట జీపీ పరిధిలోని సయ్యద్‌హుస్సే న్‌ పల్లికి చెందిన దాసరి కుమార్‌యాదవ్‌, చైతన్య దంపతులు. వీరికి కూతురు నిహాన్సి క(3) ఉంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రోజు మాదిరి గానే తల్లి చైతన్య కూతురికి స్నానం చేయించేందుకు వేడినీళ్లను బకెట్‌లో పోసి చల్లనీళ్ల కోసం వెళ్లింది. ఈ సమయంలో ఆడుకుంటూ వచ్చిన నిహాన్సిక ఒక్కసారిగా వేడినీళ్ల బకెట్‌లో పడింది. నీరంతా ప డడంతో శరీరం మొత్తం కాలింది. వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆ స్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

వరి పొలానికి నీళ్లు

పారించేందుకు వెళ్లి..

బావిలో పడి మహిళారైతు మృతి

మహబూబాబాద్‌ రూరల్‌ : వరి పొలానికి నీరు పారించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి మహబూబాబాద్‌ మండలం తోకబోడు తండా పరిధిలో చోటుచేసుకుంది. కురవి ఎస్సై జి.సతీశ్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి సాంక్రియా తండాకు చెందిన నూనావత్‌ విజయ (39)కు మండలంలోని తోకబోడు తండా శివారులో ఎకరం వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేస్తుండగా, పొలానికి నీరు పారించడానికి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి రాత్రి పొద్దుపోయే వరకూ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, తండా వాసులు ఆమె ఆచూకీ కోసం గాలించి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ ఆమె చెప్పులు, టవల్‌ కనిపించాయి. దీంతో బావిలో వెతకగా విజయ మృతదేహం కని పించింది. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అగ్నిమాపక సిబ్బంది సాయంతో బావి నుంచి విజయ మృతదేహాన్ని బయటకుతీశారు. మృతురాలి కుమారుడు శ్రీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కురవి హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటయ్య శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు.

ఎమ్మెల్యే ‘దొంతి’కి పరామర్శ

హన్మకొండ చౌరస్తా: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీత క్క పరామర్శించారు. ఇటీవల మాధవరెడ్డి తల్లి కాంతమ్మ మృతి చెందారు. శనివారం హనుమకొండలోని దొంతి నివాసంలో కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన వారిలో విప్‌ రాంచంద్రునాయక్‌, ఎమ్మెల్యేలు నాగరాజు, సత్యనారాయణరావు, ఎంపీ బలరామ్‌నాయక్‌, ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ రాజయ్య, ‘కు డా’ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, పీసీసీ బాధ్యుడు ప్రభా కర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

మృత్యువుతో  పోరాడి ఓడిన చిన్నారి
1
1/3

మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

మృత్యువుతో  పోరాడి ఓడిన చిన్నారి
2
2/3

మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

మృత్యువుతో  పోరాడి ఓడిన చిన్నారి
3
3/3

మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement