
కేటీఆర్.. నర్సింహమూర్తిని బహిష్కరిస్తావా?
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రశ్న
ములుగు: ములుగు జిల్లాలో బాండ్ మొక్కజొన్న న కిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను వచ్చి విచా రిస్తావా.. బీఆర్‌ఎస్‌కు చెందిన దళారి నర్సింహ మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా కేటీఆర్ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నించారు. బుధవారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. బాండ్ మొక్కజొన్న నకిలీ విత్తనాలను రైతులకు అందించిన ప్రైవేట్ కంపెనీలో ద ళారీగా ఉన్న బీఆర్‌ఎస్‌కు చెందిన నర్సింహమూర్తి.. కేటీఆర్ సమక్షంలో మాట్లాడుతూ ‘నా యావదాస్తిని పార్టీకి రాసిస్తా కానీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కలెక్టర్‌ను వదిలిపెట్టవద్దు’ అని మాట్లాడితే కేటీఆర్ నవ్వి ఊరుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నా రు. మొక్కజొన్న విత్తనాలతో వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో 1,521 ఎకరాల్లో పంట నష్టపోయిన 671 మంది రైతులకు కలెక్టర్ దివాకర టిఎస్ ప్రైవేట్ కంపెనీల నుంచి రూ.3. 80 కోట్లు పరిహారాన్ని ఇప్పించారని చెప్పారు. కలెక్టర్ కార్యకర్తగా పనిచేశాడని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు పరిహారం ఇప్పించిన ఘన త ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు సేవచేసే అధికారులను టార్గెట్ చేయడమే బీఆర్‌ఎస్ లక్ష్యమా అని విమర్శించారు. రైతులపై కేటీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నర్సింహమూర్తిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులపక్షాన పనిచేస్తున్న కలెక్టర్‌ను ప్రశంసించాలే తప్ప విమర్శించకూడదని ఆమె హితవుపలికారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇరుసవడ్ల వెంకన్న పాల్గొన్నారు.