మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరంచారు. అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో లక్షగాంధీ విగ్రహాల ప్రదర్శన చేపడుతున్నట్లు గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ప్రధాన కార్యదర్శి పరికి పండ్ల అశోక్, జిల్లా అధ్యక్షుడు కొండ బత్తుల ఈశ్వర్‌కుమార్ తెలిపారు. గాంధీజీ ఆశయాలను, సిద్ధాంతాలను నేటి యువత పాటించాలన్నారు. ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎకై ్సజ్ వాహనాల వేలం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను బుధవారం వేలం వేశారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల వేలంపాటలో 41 వాహనాలు ఎరాప్టు చేయగా 21 వాహనాలను దరఖాస్తుదారులు కొనుగోలు చేశారు. సదరు వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3.70లక్షలకు గాను రూ.5,39,500 ఆదాయం వచ్చినట్లు ఎకై ్సజ్ సీఐ చిరంజీవి తెలిపారు.
ఆర్టీసీ డిపో మేనేజర్‌గా కల్యాణి
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా కల్యాణి నియమితులయ్యారు. ముషీరా బాద్ డిపోలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కల్యాణి పదోన్నతిపై డీఎంగా మహబూబాబాద్ డిపోకు వస్తున్నా రు. ఇక్కడ డీఎంగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.శివప్రసాద్ బదిలీపై ఖమ్మం వెళ్లనున్నారు.
బాలసదనం తనిఖీ
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం, షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ధనలక్ష్మి పాల్గొన్నారు.

లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన పోస్టర్ల ఆవిష్కరణ