
విశ్వకర్మ చూపిన భక్తిమార్గంలో నడవాలి
మహబూబాబాద్ అర్బన్: విశ్వకర్మ చూపిన భక్తిమార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఎం. నర్సింహస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. జిల్లా అధికారి నర్సింహస్వామి, విశ్వబ్రాహ్మణ సంఘం బాధ్యులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారి నర్సింహస్వామి మాట్లాడుతూ.. విశ్వకర్మ బాటలో నడవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరేంద్ర వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వంగాల సోమనర్సయ్యచారి, ప్రధాన కార్యదర్శి విజయగిరి, వెంకట్రాజయచారి, స్వర్ణకార అధ్యక్షుడు మోత్కూరి శంకర్, ప్రధాన కార్యదర్శి ఏరోజు కృపాకర్‌చారి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నారోజు సత్యమనోహరమ్మ, ఉపాధ్యక్షులు అలుబోజు కనకాచారి, మండల బాధ్యులు పమ్మీ సనాతనచారి, పూర్ణచారి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.