
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 22నుంచి నిర్వహించే పరీక్షలకు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పదో తరగతిలో 96 మంది, ఇంటర్‌లో 102 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పన చేసి పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ తిరుపతి రావు, డీఈఓ దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.