
ఆర్టీసీ యాత్రాదానం
నెహ్రూసెంటర్: ప్రయాణికులను ఆకర్షించేలా ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలను ఆర్టీసీ తీసుకువస్తోంది. దీనిలో భాగంగా ‘యాత్రాదానం’ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా, అనాథలు, వృద్ధులను దాతల సహకారంతో విహార యాత్రలు, ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. యాత్రాదానం మహబూబాబాద్ డిపో నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే డిపో నుంచి పలు పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతోంది.
యాత్రదానం ఇలా..
ఆద్యాత్మిక క్షేత్రాలు, వినోదం, విజ్ఞానం, పర్యాటక ప్రాంతాలకు పంపించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్టీసీ యాత్ర బస్సు బుక్ చేసుకోవాలి. దాతల సహకారంతో విహార ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఉపయోగకరంగా ఉంటుంది. దాతలు ఎంత మందిని ఎంపిక చేశారు.. ఎన్ని బస్సులు కావాలనేది దాతల అభిప్రాయంతో ముడిపడి ఉంటుంది. పెళ్లిరోజు, పుట్టిన రోజు, ఇతర శుభ ముహూర్తాల్లో అన్నదానం, దుస్తుల దానం వంటివి చేయడం సహజమే. కానీ అనాథలు, వృద్ధులకు యాత్రదానం చేయడం ద్వారా వారు ఆయా ప్రాంతాలకు విహారయాత్రలో భాగంగా ఆర్టీసీ ఉపయోగపడుతుంది.
ప్రత్యేక టూర్
బస్సులు..
కాగా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి ఇప్పటికే పలు ప్రాంతాలకు విహార, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక టూర్ యాత్ర బస్సులను నడిపిస్తున్నారు. ప్రయాణికులు, యాత్రికుల నుంచి స్పందన లభిస్తుండగా మరికొన్ని కొత్త కార్యక్రమాలను ఆర్టీసీ అమలు చేస్తోంది. పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఇప్పటికే బస్సులను ఆర్టీసీ సమకూరుస్తోంది.
వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ
ఇప్పటికే ప్రత్యేక యాత్ర బస్సులు
విభిన్న మార్గాల్లో సమకూరుతున్న ఆదాయం
యాత్రదానంతో సహాయం..
ఆర్టీసీ చేపట్టిన యాత్రాదానం ద్వారా దాతలు విహార, పుణ్యక్షేత్రాలకు వెళ్లలేని వారిని పంపించవచ్చు. పెళ్లిళ్లు, పుట్టిరోజుల్లో అన్నదానం, దుస్తులు దానం తెలిసిందే.. అదేవిధంగా అనాథలు, వృద్ధులు, స్కూల్ పిల్లలను యాత్రదానం ద్వారా విహార యాత్రలకు పంపించవచ్చు.
– శివప్రసాద్, డీఎం, మహబూబాబాద్

ఆర్టీసీ యాత్రాదానం

ఆర్టీసీ యాత్రాదానం