
గ్రామీణ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం
మామునూరు: గ్రామీణ పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని వ్యవసాయ కళాశాల డీన్ భూపాల్‌రాజు సూచించారు. ఈ మేరకు ఖిలా వ రంగల్ మండలం తిమ్మాపురం రాంగోపాలపురంలో ఎస్‌ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల వి ద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామీణ పరిస్థితుల అధ్యయన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వనరులు, పటం, గ్రామ భౌగోళిక పరి స్థితులు, వ్యవసాయ స్థితిగతులు, సామాజిక అంశాలు, పశు సంవర్థక రంగం, గ్రామ సమస్యలు వంటి అనేక అంశాలను విద్యార్థులు సమగ్రంగా సేకరించి చిత్రపటాల రూపంలో ప్రదర్శించాలన్నారు. ఇన్‌చా ర్జ్ డాక్టర్ శ్రీకర్‌రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ వీరన్న, డాక్టర్ శ్రవణ్‌కుమార్, కేటీ విజయ్, ఇన్‌స్పెక్టర్లు కార్తీక్, వెంకటేశ్వర్లు, ఫార్మసీ అధికారులు జలగం రమేశ్‌కుమార్, బి.సురేశ్, డాక్టర్ మధు, శ్రావ్య, రవితేజ, ఏఈఓ సత్యప్రకాశ్, జలగం రమేశ్, సొసై టీ డైరెక్టర్లు చెన్నారెడ్డి, సాయి నందన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, ప్రసాద్‌రావు, రాములు పాల్గొన్నారు.