
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
హసన్‌పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెల్‌ఫోన్ రిపేర్ (30రోజులు), బైక్ మెకానిక్ (30రోజులు), ఏసీ, రిఫ్రిజిరేటర్ (30రోజులు), ఎల్‌ఎండబ్ల్యూ డ్రైవింగ్ (30రోజుల) శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 45ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, తెల్లరేషన్, ఆధార్‌కార్డుతోపాటు విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఈనెల 25వ తేదీ లోపు సంస్కృతీ విహార్, హసన్‌పర్తిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9704056522కు నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
వాజేడు: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల పీఈటీ తెల్లం రాజ్యలక్ష్మి జాతీయ స్థాయి చెస్ పోటీలకు ములుగు జిల్లా నుంచి ఎంపికయ్యారు. ఈనెల 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. దీంతో న్యాయనిర్ణేతలు రాజ్యలక్ష్మిని జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మిని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు పలువురు ఉద్యోగులు అభినందించారు.
రెండు బైక్‌లు ఢీ..
● జీపీ కార్యదర్శి దుర్మరణం
● రక్మీ తండా శివారులో ఘటన
నెక్కొండ: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం చెందాడు. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొర్ర వెంకట్రాం (55) మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం జయపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రక్మీ తండా శివారులో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. మృతుడి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ