
వందేభారత్‌కు సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో హాల్టింగ్
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్‌పూర్–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సిర్పూర్‌కాగజ్‌నగర్ స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి సికింద్రాబాద్–నాగ్‌పూర్ (20102) వందేభారత్, ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్‌పూర్–సికింద్రాబాద్ (201010 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సిర్పూర్‌కాగజ్‌నగర్ స్టేషన్‌లో అధికారికంగా హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. దీంతో కాజీపేట పరిసర ప్రాంతాల నుంచి సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు వెళ్లే ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్లేందుకు ఈ రైలు ఉపయోగపడనుంది.
ఆర్‌సీఎఫ్ యూరియా
వచ్చేసింది..
ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్‌కు 1,319.220 మెట్రిక్ టన్నుల ఆర్‌సీఎఫ్ యూరియా వచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు చేరిన వ్యాగన్‌ను వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని వరంగల్‌కు 209.22 మెట్రిక్ టన్నులు, హనుమకొండ 280, ములుగు 160, జయశంకర్ భూపాలపల్లి 220, జనగామ 230, మహబూబాబాద్ జిల్లాకు 220 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. కేటాయింపుల ప్రకారం ఆయా జిల్లాలకు యూరి యా తరలింపు చేపట్టినట్లు వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.
విశ్వేశ్వరయ్యకు రిజిస్ట్రార్
ఘన నివాళి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్స్‌డేను పురస్కరించుకుని సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ రమణ, టీజీఎస్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్ సంధ్యారాణి పూలమాలలువేసి ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఇంజనీర్‌గా విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు.