
దొంగల ముఠా అరెస్ట్
● కాపర్ వైర్, పలు సామగ్రి స్వాధీనం
కాటారం(మహాముత్తారం): మహాముత్తారంతోపా టు పలిమెల మండలంలో వరుస చోరీలకు పాల్ప డిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మహాముత్తారం పోలీస్‌స్టేషన్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన చిగురు సంతోష్, బుర్రకుంట ప్రకాశ్, జైనేని రమేశ్, షేక్ కుదరత్ ముఠాగా ఏర్పడ్డారు. కాటారం సబ్ డివి జన్ పరిధిలోని పలు గ్రామాల్లో పగలు ఆటోలో రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీలకు పా ల్పడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాటారం మండలంలో మూడు ట్రాన్స్‌ఫార్మర్లు, కొయ్యూర్‌లో రెండు, పలిమెల, మహాముత్తారం ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ చొప్పున పగలగొట్టి కాపర్‌వైర్ అపహరించారు. అంతేకాకుండా మహాముత్తారం మండలంలో రోడ్డుపై ఉన్న ఎడ్ల బండి ఇనుప చక్రాలు, ట్రాక్టర్ బ్యాటరీ, మంథని మండలం ఆరెందలో పవర్ టిల్లర్‌ను చోరీ చేశారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు పెట్రోలింగ్‌లో భాగంగా సోమవారం తెల్లవారుజామున యామన్‌పల్లి వద్ద ఆటోలో అనుమానాస్పందగా ఉన్న సంతోష్, ప్రకాశ్, రమేశ్, కుదరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితులు చోరీలకు పాల్పడు తున్నట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి కాపర్‌వైర్, పవర్ టిల్లర్, ట్రాక్టర్ బ్యాటరీ, ఎడ్ల బండి చక్రాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.