
ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక..
● బావిలో దూకి వ్యక్తి బలవన్మరణం
● మర్రిపల్లిలో ఘటన
దుగ్గొండి: మధ్య తరగతి కుటుంబం.. పనిచేస్తే గాని పూట గడవదు. అప్పు భారమైంది. వేధింపులు మొదలయ్యా యి. అప్పు తీర్చే మార్గం కనిపించక బావిలో దూకి బలవన్మరణాకి పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన కసివోజుల బ్రహ్మం(48) తనకున్న ఎకరంన్నర భూమిలో వ్యవసాయంతోపాటు ఇంటివద్ద వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా మిరప సాగు చేస్తుండగా పంట గిట్టుబాటు కాక అప్పులే మిగిలాయి. ఇదిలా ఉండగా ఏడాదిన్నర క్రితం ఇల్లు నిర్మించాడు. దీనికి ప్రైవేట్ బ్యాంకు, ఫైనాన్స్‌ల వద్ద అప్పు తెచ్చాడు. రూ. 20లక్షలు అప్పు అయ్యింది. ఇంటి నిర్మాణం పూర్తయింది. అయితే ప్రతీనెల వాయిదాలు చెల్లించలేకపోవడంతో బ్యాంకర్లు, ఫైనాన్సర్లు ఒత్తిడి తెస్తున్నారు. వీటికి తోడు గ్రా మంలో కొంత మంది వద్ద అప్పు తీసుకున్నాడు. దీంతో అప్పు ఎలా చెల్లించా లని వారం రోజులుగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉద యం 6 గంటలకు చేను వద్దకు వెళ్లి తిరిగా రాలేదు. దీంతో 10గంటలకు బావి వద్దకు వెళ్లిన భార్య శ్రీలత తన భర్త బావిలో పడినట్లు గుర్తించింది. దీంతో బా విలో వెతికి బ్రహ్మం మృతదేహాన్ని బయటకు తీశారు. బ్రహ్మం తన నడుముకు చున్నీతో రాయి కట్టుకుని బావిలో దూకాడు. దీంతో పైకి తేలలేదు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్‌రెడ్డి తెలిపారు.
అప్పుల బాధతో ఆటోడ్రైవర్..
బచ్చన్నపేట : అప్పుల బాధతో ఓ ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వంగా సుదర్శన్‌రెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతల అర్జున్(38) తన ఆటో మరమ్మతుకు రావడంతో మరో ఆటో కొనుగోలు చేశాడు. దీనికితోడు తల్లిదండ్రులు కూడా కుటుంబ అవసరాలకు అప్పు చేశారు. మొత్తం సుమారు రూ. 8 లక్షల వరకు కావడంతో ఎలా తీర్చాలని కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్న అర్జున్.. సోమవారం తన వ్యవసాయ బావివద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై అబ్దుల్ హమీద్ తెలిపారు.
కడుపునొప్పితో వృద్ధురాలు..
వెంకటాపురం(కె): కడుపు నొప్పితో ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘట న మండలంలోని నేలారిపేటలో జరిగింది. ఎస్సై తిరుపతిరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెంది న సంగం సమ్మక్క(60) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆ స్పత్రిలో చూపించి మందులు వాడుతున్నారు. అ యినా తగ్గకపోవడంతో ఆదివారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న బావిలో దూకి అత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం సమ్మక్క కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా బావిలో మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక..

ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక..