
శ్రాద్ధకర్మ పూజలు చేయొద్దని అభ్యంతరం
కాళేశ్వరం: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద శ్రాద్ధకర్మ పూజలు చేసేందుకు త్రివేణి తీర్థ బ్రాహ్మణ సంఘం సభ్యులంతా విశ్వబ్రాహ్మణ పురోహితుడికి అ భ్యంతరం తెలుపడంతో మనస్తాపానికి గురయ్యా డు. వెంటనే పెట్రోల్ బాటిల్ తీసుకుని మిషన్ భగీ రథ వాటర్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని, తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరిగింది. పురోహితుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కాళేశ్వరం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణుడు ము మ్మడి సురేశ్, రమ దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్ మూడేళ్లుగా గోదావరిలో శ్రాద్ధ కర్మపూజలు చేసేందుకు వారి సమ్మతితోనే వెళ్తున్నాడు.ఈక్రమంలో సోమవారం యథావిధిగా గోదావరి వద్దకు వె ళ్లాడు. అక్కడ బ్రాహ్మణ సంఘం సభ్యులందరు ‘గోదావరికి నీవు రావొద్దు.. నువ్వు వస్తే నీతోపాటు మరి కొంత మంది ఇతర కులాల వారు వస్తామంటున్నారు’ అని అభ్యంతరం తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ పెట్రోల్ బాటిల్ తీసుకొని మిషన్‌భగీరథ వాటర్ ట్యాంకు ఎక్కి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై తమాషారెడ్డి ఘటనాస్థలికి చేరుకుని నచ్చచెప్పే యత్నం చేసినా ససేమిరా అని గంటన్నర పాటు ఆందోళన చేపట్టాడు. తనకు యథావిధిగా పురోహిత వృత్తికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాడు. దీంతో బ్రాహ్మణ సంఘం సభ్యులు మాడుగుల పవన్‌శర్మ, జగన్‌శర్మ, ఆరుట్ల పవన్‌చార్యులు, రఘుచార్యులు.. హామీ ఇవ్వడంతో ఆ పురోహితుడుకిందికి దిగొచ్చాడు. దీంతో గొడవ సద్దుమణిగింది.
మనస్తాపంతో పురోహితుడి
ఆత్మహత్యాయత్నం
పెట్రోల్‌తో ట్యాంకు ఎక్కి హల్‌చల్..
కాళేశ్వరంలో ఘటన