
ప్రణాళికతో నియోజకవర్గ అభివృద్ధి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు/పెద్దవంగర: పక్కా ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని 78మంది లబ్ధిదారులకు రూ.78లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల 51 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.26.90లక్షల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోనే కాదు దేశమంతా యూరియా కొరత ఉందని, దానికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు దివ్యాంగులకు పింఛన్ పెంచాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్లు అచ్చిరెడ్డి, కంచర్ల వెంకటాచారి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, నాయకులు మోత్కూరి రవీంద్రాచారి, చిత్తలూరి శ్రీనివాస్, చెవిటి సదాకర్ పాల్గొన్నారు.