
నేడు రైల్వే అధికారుల పరిశీలన
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో నిర్మించిన మూడో రైల్వేలైన్, నూతన రైల్వే స్టేషన్ భవనం, ఎస్‌సీ–80 రైల్వే గేట్, ఇతర శాఖాపరమైన పనులను మంగళవారం కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఉన్నత అధికారి కవిత, దక్షిణ మధ్య రైల్వే జీఎం పరిశీలన చేయనున్నారు. వారివెంట ఏజీఎం, సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 13 ప్రత్యేక విభాగాల ప్రిన్సిపల్ హెచ్‌ఓడీలు తనిఖీకి రానున్నట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. ఉదయం ప్రత్యేక తనిఖీల అనంతరం దక్షిణ మధ్య రైల్వే ఉన్నత అధికారుల బృందం కేసముద్రం రైల్వే స్టేషన్, అక్కడి నుంచి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక రైలులో ప్రయాణం చేసి మూడో రైల్వే లైన్ నిర్మించిన ప్రాంతాన్ని పరిశీలన చేసి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు.