
నాణ్యమైన భోజనం అందించాలి
కేసముద్రం: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధి అమీనాపురం గ్రామంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు హాస్టల్‌లోని డైనింగ్ హాల్, స్టోర్ రూం, కిచెన్ షెడ్, చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు, వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతీ సబ్జెక్ట్‌పై అవగాహన, డిజిటల్ తరగతులు, క్రీడా, సాంస్కృతి విభాగాల్లో శిక్షణ అందించాలన్నారు. ఆ తర్వాత ధన్నసరి పీఏసీఎస్ సెంటర్‌ను సందర్శించారు. యూరియా పంపిణీ ఎలా కొన సాగుతుందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా డీఎస్పీ తిరుపతిరావు ధన్నసరి పీఏసీఎస్ సెంటర్‌ను సందర్శించి, యూరియా పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, తహసీల్దార్ వివేక్, ఎస్సై మురళీధర్‌రాజు, ఏఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా పంపిణీ చేయాలి
మహబూబాబాద్ రూరల్ : పారదర్శకంగా ప్రతీ రైతుకు యూరియా అందేవిధంగా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రా మంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు.రైతుల కోసం ఇప్పటికే అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిత్యం యూరియా పంపిణీ కోసం అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సహకార సంఘాలు, అన్ని విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారని తెలిపారు. డీఏఓ విజయనిర్మల, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, తహసీల్దార్ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్