
యూరియా పంపిణీలో ప్రభుత్వాలు విఫలం
నెహ్రూసెంటర్: యూరియా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే రైతులు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గూడూరులో యూరియా టొకెన్ల కోసం వెళ్తూ ఇద్దరు రైతులు మృతి చెందగా.. వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్ మార్చురీ ఎదుట ఆదివారం బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ యూరియా అందించడంలో జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడి వారిని ఓదార్చారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు బోడ లక్ష్మణ్‌నాయక్, ఆంగోత్ చందూలాల్, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గుగులోత్ రవినాయక్, బానోత్ రామునాయక్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
జీజీహెచ్ మార్చురీ ఎదుట ధర్నా