
ఏజెన్సీలో భారీ వర్షం
బయ్యారం: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అల్లిగూడెం, కంబాలపల్లి, రామచంద్రాపురం, లక్ష్మీపురం, మిర్యాలపెంట, ఇసుకమేధి పంచాయతీల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. అలాగే ఇల్లెందు ఏజెన్సీలో కురిసిన వర్షానికి మండలంలోని మసివాగు, రాళ్లవాగుల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో మండలం నుంచి ఇల్లెందు వైపు వెళ్లే రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి.
పెద్దచెరువుకు భారీ వరద..
మండలంలో బయ్యారం పెద్దచెరువుకు ఇల్లెందు ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో వరద ప్రవాహం పెరిగింది. మసివాగు ప్రవాహం భారీగా పెరగడంతో 16.2 అడుగుల నీటిసామర్థ్యం ఉన్న చెరువులోకి 19.2 అడుగుల మేర నీరు చేరడంతో మూడు అడుగుల మేర అలుగు పారుతోంది.
తెగిపోయిన రహదారి..
మండలంలోని భీమ్లాతండా–కొత్తూరు గ్రామాల నడుమ ఉన్న ప్రధాన రహదారి వర్షం కారణంగా తెగిపోయింది. దీంతో అల్లిగూడెం–కంబాలపల్లి ప ంచాయతీల మధ్య రాకపోకలు నిలిచిపోగా బ య్యారం నుంచి రామగుండాల మీదుగా ఇల్లెందు వైపు వెళ్లే బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలా యి. దెబ్బతిన్న రహదారి, పంటలను తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి పరిశీలించారు.
బయ్యారం పెద్దచెరువుకు భారీగా వరద

ఏజెన్సీలో భారీ వర్షం