
పాస్ కావాల్సిందే..
మహబూబాబాద్: ప్రభుత్వం భూ సమస్యల పరి ష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చింది. దీని లో భాగంగా పూర్తి స్థాయిలో రెవెన్యూ సర్వేయర్లు లేకపోవడంతో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ ఇచ్చి న తర్వాత మూడు రకాల పరీక్షలు నిర్వహిస్తుంది. ఆ పరీక్షలలో పాస్‌అయితేనే లైసెన్స్ జారీ చేయాల ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 139 మందికి కేవలం 30 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన వారి కోసం మరోమారు పరీక్ష నిర్వహించనుంది.
జిల్లాలో 31,900 దరఖాస్తులు
భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో మొదట పైలెట్ ప్రాజెక్ట్ కింద దంతాలపల్లి మండలాన్ని ఎంపిక చేసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మిగిలిన మండలాల్లో జూన్ 3 నుంచి 16 వరకు రెవెన్యూ సదస్సులు ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అదే నెల 17 నుంచి 20వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తుల స్వీకరణ చేశారు. మొత్తం 31,900 దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్ చేశారు. గ్రామ పరిపాలన అధికారుల కోసం పూర్వ వీఆర్‌ఏ, వీఆర్వోలకు అవకాశం కల్పించారు. ఆప్షన్ పెట్టుకున్న వారికి పరీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 151 మందిని ఎంపిక చేసి ఈనెల 5న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్న విషయం విదితమే.
సర్వేయర్ల పాత్రకీలకం
జిల్లాలో 18 మండలాలుండగా కేవలం 10 మంది మాత్రమే రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ప్రైవేట్ లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అవకాశం కల్పించింది. మొదటి విడతలో 181 మంది మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వారికి జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్‌లో 50 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు 181 మందిలో 139 మాత్రమే హాజరై శిక్షణ పూర్తి చేశారు.
30 మంది మాత్రమే ఉత్తీర్ణత
మొదటి విడతలో శిక్షణ పొందిన వారికి ఎస్‌ఎస్ మెంట్ పరీక్షలు, ప్రాక్టీకల్, రాత పరీక్ష ఉంటుంది. చాలా మంది ఎస్‌ఎస్ మెంట్ పరీక్ష, ప్రాక్టీకల్స్ పాస్ అవుతున్నారని అధికారులు తెలిపారు. రాత పరీక్షలో 139 మందికి కేవలం 30 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
లేదంటే లైసెన్స్ రాదు
రెవెన్యూ సర్వేయర్లకు పరీక్షలు
మొదటి విడతలో 139 మందిలో 30 మంది మాత్రమే ఉత్తీర్ణత
ఫెయిల్‌అయిన వారి కోసం మరోసారి అవకాశం
నేడు రాత పరీక్ష
94 మంది
దరఖాస్తులు
మొదటి విడతలో ఫెయిల్‌అయిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మొదటి విడతలో ఫెయిల్ అయిన 94 మంది మళ్లీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి నేడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా రెండో విడతలో 185 మంది దరఖాస్తు చేసుకోగా 137 మంది శిక్షణకు హాజరవుతున్నారు. వారికి శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించనున్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
నేడు నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష పాస్ అయితేనే లైసెన్స్‌ను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంది. రెండో విడత శిక్షణ కొనసాగుతోంది. వారికి కూడా పరీక్షలో పాస్ అయితేనే లైసెన్స్ జారీ చేస్తారు.
– నర్సింహమూర్తి, భూమి కొలతల జిల్లా అదనపు డైరెక్టర్