
రాజీ మార్గం అత్యుత్తమం
8లోu
మహబూబాబాద్ రూరల్ : రాజీమార్గమే ప్రశాంతమైన జీవన విధానానికి మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. భార్యభర్తల మధ్య వచ్చే తగాదాలతో ఎన్నో రకాల కేసులు నమోదవుతున్నాయని, వీటన్నింటికీ భార్యాభర్తలు ఒక కేసులో రాజీ పడినట్లయితే మిగతా అన్ని కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు సహకరిస్తున్న న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.శాలిని మాట్లాడుతూ కక్షిదారులకు తక్కువ సమయంలో అంతిమమైన పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.ప్రేమ్ చందర్, న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణతేజ్ అర్వపల్లి, న్యాయవాదులు, వివిధ బ్యాంకుల అధికారులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
6,482 కేసుల పరిష్కారం...
జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 6,482 కేసులను పరిష్కరించారు. ఇందులో రాజీపడిన 104 క్రిమినల్ కేసులు, నేరం ఒప్పుకున్న క్రిమినల్ కేసులు 116, చెక్కు బౌన్స్ కేసులు రెండు, సివిల్ కేసులు ఎనిమిది, సైబర్ క్రైమ్ కేసులు 22, ఒప్పుకున్న సెకండ్ క్లాస్ కోర్టు నేరం కేసులు 865 ఉన్నాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ప్రిలిటిగేషన్, ట్రాఫిక్, బీఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకు, విద్యుత్ శాఖ మొత్తం కేసులు కలిపి 5,350 ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద (ఎంవీఓపీ) కేసులు 15 పరిష్కరించి బాధితులకు రూ.1,16,45,000 పరిహారంగా అందజేయాలని ఆదేశించారు.
న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే
హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్
డీసీసీబీ భవన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ