
పెంపకమే ప్రాధాన్యం..
వైద్య పరీక్షలు తప్పనిసరి..
కాజీపేట/చిల్పూరు : పాడి అభివృద్ధికి పెయ్యదూడల సంరక్షణనే కీలకం.. దూడల పెంపకంపై పాడి రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని పశు వైద్యాధికారులు తెలిపారు. దూడల పెంపకంపై శ్రద్ధ వహిస్తే అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. పెయ్యదూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మడికొండ పశువైద్యాధికారి కరుణాకర్ రెడ్డి, మల్కాపూర్ పశువైద్యాధికారి మూడిక అనేష్ సూచనలు..
జాగ్రత్తలు తప్పనిసరి..
పెయ్యదూడలు పుట్టినప్పటి నుంచి ఎదకు వచ్చే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దూడలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టిన దూడకు వెంటనే జున్ను పాలు తాగించాలి. దీంతో దూడలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్‌లో వాటికి వ్యాధులు సోకకుండా, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అవగాహన లేక కొంతమంది రైతులు పాడి పశువుల నుంచి మొత్తం పాలను పితుకుతారు. దీంతో దూడలకు పాలు సరిపోక నీరసించి, వ్యాధి నిరోధక శక్తి కోల్పోతుంది. అనంతరం వ్యాధుల బారిన పడి మృత్యువాత పడే అవకాశం ఉంది. అందుకే రైతులు దూడలకు సరిపడా పాలు అందేలా జాగ్రత్త వహించాలి.
పాడి పరిశ్రమ వైపు మొగ్గు..
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తదితర పనుల నిర్వహణకు తగినంత సాగునీరు లేకపోవడంతో రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రారంభంలో ఒకటి, రెండు ఆవులను కొనుగోలు చేసి పాడిని ప్రారంభిస్తున్నారు. వ్యవసాయ పనులతో పాటు ఉదయం, సాయంత్రం కొద్దిపాటి సమయం పాడి పశువుల కోసం సమయం కేటాయిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఇప్పటికే ఆవులను కొనుగోలు చేసి, లాభాలు పొందుతున్న రైతులను గమనిస్తున్న ఇతరులు పాడి ఆవులను కొనుగోలు చేసి పాడి పరిశ్రమపై ఆధారపడేందుకు మొగ్గు చూపుతున్నారు. దూడలను కాపాడుకుంటూ అదనపు ఆదాయం పొందుతున్నారు.
పాడి రైతులు పుట్టిన దూడల పెంపకంపై జా గ్రత్త వహించకుండా పాలిచ్చే ఆవులపై మా త్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. లేగదూడలు పుట్టి న వెంటనే వాటికి ముర్రుపాలు తాగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బొడ్డు కోసే సమయంలోనూ జాగ్రత్త అవసరం. లేగదూడల వ యస్సును బట్టి అవి బలిష్టంగా పెరిగేందుకు సరిపడా పాలు మిగల్చడం ఎంతో ముఖ్యం. దూడలు ఆరోగ్యంగా పెరిగితేనే భవిష్యత్‌లో అధిక మొత్తంలో పాలు ఇస్తాయి. పెంపకంలో ఎటువంటి అనుమానం తలెత్తిన వెంటనే స మీపంలోని పశువైద్యాధికారిని సంప్రదించా లి. వెంటనే అనుమానాన్ని నివృత్తి చేసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలి. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. పాడిపశువుల విషయంలో పరిశుభ్రత ము ఖ్యమైందని పెంపకందారులు గుర్తించాలి.
దూడల సంరక్షణతోనే పాడి వృద్ధి
మడికొండ, మల్కాపూర్
పశువైద్యాధికారులు కరుణాకర్ రెడ్డి, అనేష్
దూడలకు సోకే వ్యాధులు..
పెయ్యదూడల సంరక్షణలో వాటికి పలు వ్యాధులు సోకే అవకాశం ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ఇతరత్రా వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దూడలకు అతిసార, తెల్ల పారుడు, న్యూమోనియా, రక్తవిరోచనాలు, కీళ్ల నొప్పులు, బొడ్డువాపు వ్యాధులతో పాటు ఇతరత్రా వ్యాధులు, పరాన్న జీవులతో వ్యాప్తి చెందుతాయి. దూడలు ఎటువంటి రోగాల బారిన పడకుండా పెరిగితే రైతుకు ఆదాయమే. వీటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.