
ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: రెండు రోజుల పా టు నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–5 నుంచి 18 బాలబాలికలకు రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు ఆదివారం ముగిశా యి. మొదటి రోజు ఉనికిచర్లలోని ఎస్‌ఎస్‌హౌస్ వద్ద నిర్వహించగా, రెండో రోజు రాంపూర్‌లోని ఢిల్లీ పబ్లి క్ స్కూల్ ఆవరణలోని స్కేటింగ్ రింక్‌లో నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు స్కేటింగ్ అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిద్దార్థ, ఓం ప్రకాశ్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీ డాకారులు త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తామనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. విజేతలకు డీపీఎస్ ప్రిన్సిపాల్ ఇన్నారెడ్డి బహుమతులు అందజేశారు.