
పీఆర్‌సీ అమలు చేయాలి
టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర చీఫ్ పాట్రన్ సంజీవరెడ్డి
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 60 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) రాష్ట్ర చీఫ్‌పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో టీఆర్‌టీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ స్టేట్ జాయింట్ కౌన్సిల్‌లో టీఆర్‌టీఎఫ్‌నకు తిరిగి ప్రాతినిథ్యం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కోకన్వీనర్ దాక్షపు విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్‌టీఎఫ్ బాధ్యులు పెండెం మధుసూదన్, రాజునాయక్ మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రెండు జిల్లాల నూతన కార్యవర్గాలను ఎన్నకున్నారు.
హనుమకొండ జిల్లా కార్యవర్గం..
టీఆర్‌టీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బాసిరి రాజిబాపురావు, ప్రధాన కార్యదర్శిగా గు గులోత్ శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షులుగా గుండు సదానందం, బంగారు స్వామి ఎన్నికయ్యారు.
వరంగల్ జిల్లా..
టీఆర్‌టీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వడ్డె కిషన్, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రాజు, ఉపాధ్యక్షులుగా భక్తిని రాజేశ్, శ్రీపతి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శులుగా ల్యాద లింగమూర్తి, కలకోట ప్రభాకర్, బుర్ర మొగిలి, శివశంకర్ ఎన్నికయ్యారు. సమావేశంలో బాధ్యులు మాడిశెట్టి శ్రీనివాస్, సర్వర్‌నాయక్, సారంగం, మురళి పాల్గొన్నారు.

పీఆర్‌సీ అమలు చేయాలి

పీఆర్‌సీ అమలు చేయాలి