
మహబూబాబాద్
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సమన్వయ సమావేశాలు నిర్వహించాలి
7
మహబూబాబాద్: జిల్లాలో పకడ్బందీగా యూరియా పంపిణీ విషయంలో మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి రైతు వేదికలు, ప్రాథమిక సహకార సొసైటీల వద్ద అందుబాటులో ఉండాలని, రైతులకు స్టాక్ వివరాలను తెలియపర్చాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి యారియా పంపిణీని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, డీఏఓ వి జయనిర్మల, డీసీఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
యూరియా పంపిణీ సజావుగా జరగాలి
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్

మహబూబాబాద్

మహబూబాబాద్