
యూరియా అందేలా చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
గార్ల: ప్రతీ రైతుకు యూరియా బస్తాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గార్లలోని పీఏసీఎస్ గోదాం, సీహెచ్‌సీ, కేజీబీవీని పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క అధికారి అంకితభావంతో పనిచేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా స రఫరా చేయాలన్నారు. గోదాం వద్దకు వెళ్లి యూ రియా నిల్వలను పరిశీలించారు. అలాగే సీహెచ్‌సీని తనిఖీ చేసి వైద్యులు, వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డీసీహెచ్‌ఎస్ రమేశ్‌ను ఆదేశించారు. రోగుల వార్డులను పరిశీలించి, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కేజీబీవీ సందర్శించి, తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. డీపీఓ హరిప్రసాద్, తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, ఏఓ కావటి రామారావు, సీఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
డోర్నకల్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌సింగ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ సిబ్బంది వివరాలు, సిబ్బంది హాజరు రికార్డులు తనిఖీ చేశారు. మాతా, శిశు మరణాల నివారణకు మందస్తు చర్యలు చేపట్టాలని, సాదారణ ప్రసవాలను పెంచాలని సూచించారు. అనంతరం పీఏసీఎస్‌లో ఎరువుల పంపిణీని పరిశీలించారు.