
మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి
నెహ్రూసెంటర్: మహిళల రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి గాడిపెల్లి ప్రమీల డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అన్ని రంగాల్లో మహిళలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు నడుంబిగించాలనిపిలుపునిచ్చారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుఛిజీ సూర్నపు సోమయ్య, సంఘం జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత, తాళ్లపల్లి రమ, సావిత్ర, మమత, చాగంటి భాగ్యమ్మ పాల్గొన్నారు.
పంపిణీ పరిశీలన
కురవి: సీరోలు మండలం కాంపల్లి సొసైటీలో గురువారం యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులతో మాట్లాడారు. యూరి యా పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూ డాలని సూచించారు. యూరియా రైతులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట సీరోలు ఏఓ చాయారాజ్, తహసీల్దార్ పున్నంచందర్ ఉన్నారు.
ఇంటర్‌లో ప్రవేశాలకు ఆహ్వానం
గూడూరు : మండలంలోని దామరవంచ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 6, బైపీసీలో 17 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ ఎం.రమే్‌శ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల జిల్లాలోని గిరిజన బాలురు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేడు (శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాజరై అడ్మిషన్ పొందాలని ఆయన పేర్కొన్నారు.

మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి