
రైతులకు సరిపడా యూరియా
● డీఏఓ విజయనిర్మల, డీసీఓ వెంకటేశ్వర్లు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని రైతులందరికీ యూరియా అందించడం కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని జిల్లా వ్యవసాయ, జిల్లా సహకార శాఖల అధికారులు విజయనిర్మల, వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో రైతులకు యూరియా అంది ంచడానికి అన్ని మండలాలలకు ప్రత్యేక అధికారులను నియమించారని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ స్వయంగా రైతులను కలుస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని, ప్రస్తుతం అందిస్తున్న యూరి యా, వచ్చే యూరియా వివరాలను క్లస్టర్ల వారీగా రైతులకు సమాచారం అందిస్తున్నారన్నారు. జిల్లాలో 44 యూరియా అమ్మకాల కేంద్రాలు, 20 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. మరో 10 కేంద్రాల నిర్వహణ కోసం ప్రతి పాదనలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 27,347 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. రైతులు నానో యూరియా వినియోగించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమావేశంలో డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కొరత లేకుండా చర్యలు
డోర్నకల్: జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఏఓ విజయనిర్మల తెలిపారు. మండలంలోని అమ్మపాలెం గ్రామ రైతువేదిక భవనంలో జరుగుతున్న యూరియా కూపన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం డీఏఓ పరిశీలించారు. గొల్లచర్ల సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఎరువుల పంపిణీని మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, సీఐ చంద్రమౌళి, వ్యవసాయ అధికారి మురళీమోహన్ తదితరులు పరిశీలించారు.