
పేకాట శిబిరంపై పోలీసుల దాడి
● నలుగురి అరెస్ట్
వరంగల్ క్రైం : పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ మేకల రంజిత్‌కుమార్ గురువారం తెలిపారు. సుబేదారి పీఎస్ పరిధి జులైవాడలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయగా నలుగురు పట్టుబడ్డారు. దీంతో నిందితుల నుంచి రూ. 1.04 ల క్షలు స్వాధీనం చేసుకుని జులైవాడకు చెందిన భూక్య రవి, గుండ్లసింగారానికి చెందిన మాలోత్ రాజు, రాయపర్తికి చెందిన హలావత్ వినోద్, అదాలత్‌కు చెందిన నూనవత్ తిరుపతిని అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్సై రామారావు, కానిస్టేబుళ్లు మారేపల్లి ప్రభాకర్, అఖిల్, ప్రమోద్‌ను ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ అభినందించారు.