
చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను అధ్యయనం చేయాలి
మహబూబాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు అధ్యయనం చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్‌వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి, జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
కలెక్టరేట్‌లో ఐలమ్మ వర్ధంతి