
యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి
కొత్తగూడ: యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. బుధవారం మండలంలో యూరియా పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. టోకెన్ల జారీ వివరాలను ఏఈఓ రాజును అడిగి తెలుసుకున్నారు. వచ్చిన యూరియాను గ్రామాల వారీగా కేటాయించి టోకెన్లు జారీ చేస్తున్నట్లు వివరించారు. యూరియా కోసం రాత్రి వచ్చి రైతు వేదిక వద్ద చాలా మంది రైతులు పడుకున్నట్లు తెలిపారు. ఉదయం భారీగా రైతుల ఒత్తిడి జరిగినట్లు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి సమయంలో పోలీసులు రైతు వేదికలను పరిశీలించాలని, రైతులు ఇక్కడ పడుకోకుండా చూడాలని ఎస్సై రాజ్‌కుమార్‌కు సూచించారు. రైతులు ఆందోళన చెందవద్దని అందరికీ యూరియా వస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం యూరియా గోదాంలు, పొగుళ్లపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని పరిశీలించారు. ఎస్పీ వెంట గూడూరు సీఐ సూర్యప్రకాశ్ తదితరులు ఉన్నారు.