
కల్తీ మద్యం బాటిళ్ల స్వాధీనం
గార్ల: మండలంలోని పెద్దకిష్టాపురం పంచాయతీ పరిధి ముష్టికుంట సమీపంలోని పంట కాలువల్లో మంగళవారం కల్తీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ముష్టికుంట సమీపంలోని కాలువల్లో ఉన్న కల్తీ మద్యం బాటిళ్లను గ్రామస్తులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి ఎస్సై రియాజ్‌పాషా సిబ్బందితో చేరుకొని సుమారు 120 ఐబీ, రాయల్‌స్టాగ్ కల్తీ మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జిల్లా కేంద్రం సమీపంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంలో హస్తం ఉన్న పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జైలుకు వెళ్లారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న బాటిళ్లు సైతం వారికి సంబంధించినవే అయి ఉంటాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎకై ్సజ్ సీఐ చిరంజీవి, ఎస్సై రియాజ్‌పాషాను సాక్షి వివరణ కోరగా.. ముష్టికుంట వద్ద 120 కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు.