
కలెక్టర్ ఇంటివైపు మురుగు.. పరుగు
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీలు పొంగిపొర్లి మురుగు నీరు రోడ్లపై చేరుతోంది. ఏకంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం రోడ్డులో సైడ్ డ్రైయినేజీలో వ్యర్థాలు పేరుకుపోయి రోడ్డుపై ముగురుప్రవహిస్తోంది. కాగా అటు వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అధికారులు ఉండే ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్యులు ఉండే కాలనీల పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.