
మూతబడిన పాఠశాలలు
డోర్నకల్: మండలంలోని చాప్లాతండా, పాతదుబ్బతండా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడం లేదు. పలు గ్రామాల్లో విద్యార్థులు లేక ఒక్కొక్కటిగా పాఠశాలలు మూసివేయగా.. ప్రస్తుతం చాప్లాతండా, పాతదుబ్బతండా పాఠశాలలు వాటి సరసన నిలిచాయి. చాప్లాతండా పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయురాలిని మరో పాఠశాలకు కేటాయించారు. దీంతో చాప్లాతండా పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. అలాగే పాతదుబ్బతండా పాఠశాలలో విధులు చేపట్టిన ఉపాధ్యాయురాలు పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. దీంతో అక్కడ చదివే ముగ్గురు విద్యార్థులు రాకపోవడంతో పాఠశాల మూతబడింది. అలాగే మండలంలో పదిమంది లోపు విద్యార్థులు ఉన్న మరో పది పాఠశాలలు మూసివేసే అవకాశం ఉంది.

మూతబడిన పాఠశాలలు