
ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్
● రోడ్డుపై పల్టీలు కొట్టిన వాహనాలు
● 40 మంది వాహనదారులకు గాయాలు
జనగామ: జనగామ పట్టణం శ్రీవిల్లాస్ కాలనీ యూ టర్న్ నుంచి హైదరాబాద్ రోడ్డు అటవీ శాఖ కార్యాలయం వరకు సోమవారం హైవేపై ఓ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకై పడడంతో వాహనదారులు పల్టీకొట్టారు. సుమారు కిలో మీటర్ వరకు రోడ్డుపై ఆయిల్ పడడంతో బైక్‌లు, చిన్న వాహనాలు జారి పడగా వాహనదారులు గాయాల పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అజయ్, ఫయాజ్ రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా అక్కడే ఉండి పర్యవేక్షించారు. కాగా, సుమారు 40 మందికి పైగా గాయాలు కాగా, ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు.
అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చిన మహిళ అరెస్ట్
నర్సంపేట రూరల్ : అధిక వడ్డీకి డబ్బులు ఇ చ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న న ర్సంపేటకు చెందిన గుజ్జ సుజాతను అరెస్ట్ చే సి కోర్టులో హాజరుపర్చినుట్ల టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన గుజ్జ సుజాత అధిక వడ్డీకి డబ్బులు అప్పుగా ఇస్తూ వారి వద్ద నుంచి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. సుజాతపై నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయని, ఆమె ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగిందన్నారు. ఈ క్రమంలో శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు.
తాబేళ్ల కోసం వెళ్లి
కుంటలో వ్యక్తి గల్లంతు
● రెస్క్యూ టీం గాలింపు.. లభించని ఆచూకీ
కురవి: తాబేళ్ల వేట కో సం కుంట వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన కురవి మండలం తిర్మలాపురం–నల్లెల్ల శివారులోని గణేశ్ కుంటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లికుదురు మండలం వావిలాలకు చెందిన భూతం వెంకన్న కుటుంబంతో కలిసి కొన్నేళ్ల నుంచి కురవిలోని చెంచు కాలనీ వద్ద జీవిస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన బాజ వెంకన్నతో కలిసి ఆదివారం మధ్యాహ్నం గణేశ్ కుంట వద్దకు తాబేళ్ల కోసం వచ్చాడు. అనంతరం భూతం వెంకన్న ఇంటికి చేరుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న వెంకన్న భార్య రమణమ్మ కాలనీలోని పెద్దలకు చెప్పింది. భూతం వెంకన్న తన దుస్తులు, పర్సు, సెల్‌ఫోన్ తీసి కట్టపై పెట్టి కుంటలోకి దిగినట్లు అతడి వెంట ఉన్న బాజ వెంకన్న సోమవారం కాలనీ పెద్దలకు చెప్పగా వారు గణేశ్ కుంట వద్దకు వచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే కురవి పోలీసులు, మానుకోట అగ్నిమాపక శాఖ ఎస్సై మోహన్‌రావు, సిబ్బంది గోపి, షఫీ, రమేశ్, రహీం ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీం సాయంతో కుంటలో గల్లంతైన వెంకన్న కోసం గాలించారు. సాయంత్రమైనా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాజ వెంకన్నను పోలీసులు విచారిస్తున్నారు. కాగా, భూతం వెంకన్న గల్లంతుతో భార్య రమణమ్మతోపాటు కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు.

ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్

ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్