
అవగాహనే ఆయుధం
సైబర్ మోసాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలి. చాలా మంది చదువుకున్న వారే మోసపోతున్నారు. ఎవరైనా తెలిసిన వ్యక్తులు డబ్బులడిగితే ప్రొఫైల్ ఫొటో చూసి మోసపోవద్దు. ఫోన్ నంబర్ చెక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో పెట్టుబడి పేరుతో ఆహ్వానాలు వస్తే నమ్మెద్దు. ఒకే రోజు వేల రూపాయలు ఏ వ్యాపారంలో రావు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు ఎత్తకుండా, ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయకుంటే నష్టం ఉండదు. మోసపోయిన వెంటనే టోల్‌ఫ్రీ 1930 నంబర్‌కు ఫోన్ చేసి పోగొట్టుకున్న నగదును పుట్ అన్‌హోల్డ్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా పరిచయాలతో ప్రమాదం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త
– కలకోటి గిరికుమార్, ఏసీపీ, సైబర్ క్రైమ్