
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ లోకో ఇంజనీర్ (సీఈఎల్‌ఈ) బి.పి.ఎస్.రాథోర్ అన్నారు. గురువారం సీఈఎల్‌ఈ షెడ్‌లో వివిధ విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం లోకోల నిర్వహణ పనితీరుపై విజయవాడ, లాలాగూడ, మౌలాలి, కాజీపేట డీజిల్‌షెడ్, ఎలక్ట్రిక్‌షెడ్ నుంచి పాల్గొన్న అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాగా, షెడ్ అభివృద్ధి, రైల్వే కార్మికుల సమస్యలను స్థానిక షెడ్ సీనియర్ డీఈఈ సూర్యనారాయణను అడిగి తెలుసుకున్నారు.
సీఈఎల్‌ఈకి నాయకుల వినతి
సీఈఎల్‌ఈ రాథోర్‌కు రైల్వే మజ్దూర్ యనియన్ కాజీపేట ఈఎల్‌ఎస్ బ్రాంచ్ నాయకులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. షెడ్‌లో లోకోల నిర్వహణకు సరిపడా స్టాఫ్ పెంచాలని, ఈఎల్‌ఎస్‌కు వచ్చే మార్గంలో రైల్వే ట్రాక్‌పై ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని, వెహికిల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలనే తదితర సమస్యలను వివరించారు. దీనిపై సీఈఎల్‌ఈ స్పందించి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు బ్రాంచ్ సెక్రటరీ నాయిని సదానందం, చైర్మన్ ఇబ్రహీం తెలి పారు. కార్యక్రమంలో ఈఎల్‌ఎస్ బ్రాంచ్ ట్రెజరర్ బి.రవీందర్‌రెడ్డి, ఆఫీస్ బేరర్స్ వైస్ చైర్మన్ ఎస్. గోపి, ప్రభాకర్, ఎస్.స్వర్ణకుమారి, అసిస్టెంట్ సెక్రటరీ పి.రాజు, అరుణ్‌కుమార్, అశోక్ పాల్గొన్నారు.
● రైల్వే సీఈఎల్‌ఈ రాథోర్
● కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ తనిఖీ

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి