
యూరియా కోసం వెళ్తే బంగారం పోయింది..
స్టేషన్‌ఘన్‌పూర్: ఓ మహిళ యూరియా తీసుకెళ్తుండగా చైన్‌స్నాచింగ్ జరిగింది. దుండగుడు ఆమె మెడలోనుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటన మండలంలోని విశ్వనాథపురం సమీపంలో జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సముద్రాల శివారులోని నారాయణపురం గ్రామానికి చెందిన కత్తుల రాజమ్మ తన భర్త యాదగిరితో కలిసి గురువారం యూరియా కోసం స్టేషన్‌ఘన్‌పూర్ వచ్చింది. యూరియా తీసుకుని అదే రోజు సాయంత్రం దంపతులు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై సముద్రాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ బైక్‌పై వారి వెనుక వచ్చిన దుండగుడు విశ్వనాథపురం సమీపంలో రాజమ్మ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కుని ఉడాయించాడు. ఈ ఘటనలో సదరు మహిళ ద్విచక్రవాహనంపై కింద పడి స్పృహ తప్పింది. గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన అనంతరం లబోదిబోమని రోదించింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. క్రైం విభాగం సీఐ రాఘవేందర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.
విశ్వనాథపురం సమీపంలో
చైన్‌స్నాచింగ్
మూడున్నర తులాల బంగారు గొలుసు అపహరించిన దుండగుడు