
దేవాలయ భూముల్లో భవనాలు ఖాళీ చేయాలి
● గోవిందరాజుల గుట్ట భూమి ఆక్రమణపై దేవాదాయ శాఖ నోటీసులు
వరంగల్ చౌరస్తా : వరంగల్‌లోని చారిత్రక గోవిందరా జుల గుట్ట దేవాలయ భూముల ఆక్రమణలపై మల్ల గుల్లాలు పడిన దేవాదాయశాఖ అధికారులు ఎట్టకేలకు కదిలారు. దేవాలయానికి చెందిన భూములపై పలు మార్లు సర్వే చేసిన అధికారులు.. రెండు రోజుల క్రితం వ్యాపార సంస్థలు, ఇళ్లవాసులకు నోటీసులు జారీ చేశా రు. ఆలయానికి చెందిన సర్వే నంబర్ 15/1, 15/2. 38లో సుమారు 8 ఎకరాలు ఉందని నిర్ధారించారు. అయితే సర్వేలో 5 ఎకరాల 25 గుంటలు మాత్రమే తేలింది. మిగతా స్థలంలో అక్రమంగా వ్యాపార సంస్థలు, నివాస గృహాలను నిర్మించుకున్నట్లు భావిస్తున్నా రు. సుమారు 54 నిర్మాణాలుండగా, అందులో 15 వ్యా పార సంస్థలు, 39 నివాస గృహాలు ఉన్నాయి. వీరందరూ వ్యాపార సంస్థలు, నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయగా, కొంత మంది స్వీకరించగా, మరికొందరు నిరాకరించారు.
సీపీఎం నేతలు, గృహ యజమానుల నిరసన
గోవిందరాజుల గుట్ట చుట్టూ ఉన్న నివాస గృహాలకు దేవాదాయ శాఖ అధికారులు ఇళ్లు ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీస్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆ లయ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. 120 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీ విస్తున్న పేద, మధ్యతరగతి 54 కుటుంబాలకు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి ఆందోళన గురి చేస్తున్నారని మండిపడ్డారు. నాయకులు బాబు, మా ధవి, కుమార్, శివ, సంపత్, రమేశ్,యాదగిరి, రామ సరోజన, సదానందం, గోవర్ధన్ పాల్గొన్నారు.