
విద్యార్థులతో ఫిజికల్ సైన్స్ టీచర్ రాజేందర్ అద్భుతా
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం జెడ్పీహెచ్‌ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు దొనికల రాజేందర్.. విద్యార్థులతో అద్భుతాలు చేసి జూన్ 29న వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అక్షయ భౌతిక శాస్త్రంలో న్యూటన్ సిద్ధాంతాలపై నిర్వహించిన దశవధానంపై చేసిన అంశం ఆకట్టుకుంది. మరో 12 మంది విద్యార్థులు రసాయనశాస్త్రంలోని 118 మూలకాల పేర్లు 8 సెకన్ల వ్యవధిలో చదివారు. ఇందుకుగాను ‘వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ చోటులో లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. అక్షయ.. భౌతికశాస్త్రంలో ఒకేసారి పది మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మధ్యలో ఇతర అంశాలతో మిళితంగా సమాధానాలు ఇవ్వడమేకాక, శాస్త్రవేత్తల పేర్లు, చిత్రాలను గుర్తుపెట్టుకొని అద్భుతంగా వివరించిన విధానం ఆకట్టుకుంది.