
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
మహబూబాబాద్: ఆహార పదార్థాల తయారీ, విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో తనిఖీలు చేశామన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీలు ప్రసాదాలు, పులిహోర తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్వాహకులకు తెలియజేశామన్నారు. డోర్నకల్, కురవి, బయ్యారం, కేసముద్రం, గూడూ రు, మానుకోట పట్టణాల్లో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో ఏదైనా హోటల్స్, బేకరీలు, స్వీట్ షాపులు, రెస్టారెంట్స్, కిరాణా షాపుల్లో కల్తీ జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 90002 84353 నంబర్‌కు కాల్ చేసి చెప్పాలని ఆయన కోరారు.
ఆకస్మిక తనిఖీ
గార్ల: గార్ల పట్టణంలోని పలు హోటళ్లలో గురువారం జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వంటల్లో కల్తీ వస్తువులు వాడినట్లు తేలితే హోటళ్లపై చర్యలు తప్పవన్నారు. అనంతరం గణేశ్ మండపాల వద్ద పులిహోర, అన్నదానం కోసం చేసే వంటలను ఆయన పరిశీలించారు.