
గురుతర బాధ్యత
న్యూస్‌రీల్
– మరిన్ని కథనాలు 8లోu
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ఆదర్శం..కల్వల పాఠశాల ఉపాధ్యాయులు
● రికార్డుస్థాయిలో ప్రాథమిక పాఠశాలలో 87 అడ్మిషన్లు
కేసముద్రం: విద్యాబోధనతో పాటు సౌకర్యాల కల్పనపై ఉపాధ్యాయు లు తల్లిదండ్రులకు నమ్మకం కల్పించారు. ఈక్రమంలో ఈవిద్యా సంవత్సరం 87 అడ్మిషన్లు చేశారు. మండలంలోని కల్వల ప్రాథమిక పాఠ శాల హెచ్‌ఎం కల్లెం వీరారెడ్డి, ఉపాధ్యాయులు విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి సారించారు. హెచ్‌ఎం తన సొంత ఖర్చులతో స్పెషల్ యూనిఫాం, ఐడీకార్డులు, టై, బెల్టులు, నోట్‌బుక్స్ విద్యార్థులకు అందజేశారు. కాగా 2024–25 విద్యాసంవత్సరం 55 మంది విద్యార్థులు ఉండగా.. 2025–26 విద్యాసంవత్సరంలో 87 అడ్మిషన్లు చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాఠశాలలో 147 మంది విద్యార్థులు ఉన్నారు. హెచ్‌ఎం రూ.46వేలు వెచ్చించి స్కూల్ బిల్డింగ్‌కు రంగులు వేయించారు. చుట్టు పక్కల గ్రామాలు, తండాల్లో పాఠశాలలు ఉన్నప్పటికీ.. విద్యార్థులు ఆటోల్లో ఇక్కడికి రావడం గమనార్హం.
సమాజంలో గురువు స్థానం వెలకట్టలేనిది. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సన్మార్గంలో నడిచేలా ఉపాధ్యాయులు బోధిస్తారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థులకు మెరుగైన బోధన చేసిన పలువురి ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
విభిన్న పద్ధతుల్లో విద్యా బోధన
● మూతపడిన పాఠశాల పునఃప్రారంభం
కొత్తగూడ: మండలంలోని చెరువుముందుతండా శివారు ఓ మారుమూల ఏజెన్సీ గ్రామం దొరవారివేంపల్లి. గ్రామానికి వెళ్లడానికి దారి కూడా లేదు. దీంతో గ్రామ ప్రాథమిక పాఠశాలకు రావడానికి ఉపాధ్యాయులు ఇష్టపడే వారు కాదు. ఈక్రమంలో పాఠశాల మూతపడగా.. విద్యాశాఖ అధికారులు 2022లో పునఃప్రారంభించి ఉపాధ్యాయుడు సువర్నపాక కృష్ణను కేటాయించారు. ఆయన పాఠశాల రూపురేఖలు మార్చాడు. రంగులు వేయించి వివిధ బొమ్మలు, అచ్చులు, నంబర్లు, ఏబీసీడీలు, జాతీయ నాయకులు ఫొటోలు పెయింటింగ్ వేయించాడు. విద్యార్థులకు తన సొంత ల్యాప్‌టాప్ ద్వారా డిజిటల్ తరగతులు బోధించాడు. ఈక్రమంలో విద్యార్థుల సంఖ్య 25కు చేరింది. కాగా విద్యార్థులకు చదువుతో పాటు వ్యవసాయం, సస్యరక్షణ చర్యలపై అవగాహన క ల్పిస్తున్నాడు. వారంలో ఒకరోజు వ్యవసాయ పనులు చేయ డం నేర్పిస్తున్నాడు. అలాగే ఐదో తరగతి పూర్తయిన 10మంది విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్ష రాయగా అందరికీ సీట్లు వచ్చాయి. కాగా కృష్ణ పనితీరును గుర్తించి గత ఏడాది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు.

గురుతర బాధ్యత

గురుతర బాధ్యత

గురుతర బాధ్యత